Andhra Mahabharatamu 3.3.380
Āndhra Mahābhāratamu 3.3.380
- Language
- Telugu
3.3.380
వ. ‘మీ రిందు మసలవల; దిది యక్ష రాక్షస ప్రచారఘోరం’ బనిన నందుండ నొల్లక పాండవులు తత్సమీపంబున నివాసంబుఁ జేసికొని రాక్షస బలంబుతో ఘటోత్కచుఁ బోవంబనిచి యుండు నంత, జటాసురుం డను రాక్షసుండు బ్రాహ్మణరూపధరుండై’ యేను వేదవిదుండ, ధనుర్వేదవిదుండైన పరశురాము శిష్యుండ’ ననుచుం బాండవుల సేవించుచున్నంత నొక్కనాఁడు.