Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.293

Āndhra Mahābhāratamu 3.4.293

Language
Telugu

3.4.293

సీ. పాషండదర్శనబహుళంబు లయ్యెడు | వర్ణాశ్రమంబులు వసుమతీశ!
తవిలి శరీరంబుఁ దద్దయుఁ బ్రోతురు | పుణ్యఫలంబులు బొంకు లనుచుఁ;
గాలంబుతోఁ గూడఁ గలుగవు వానలు; | పొల్లులై బీజముల్‌ వొలిసిపోవుఁ;
గ్రయవిక్రయంబులఁ గపటంబు దఱచగుఁ; | గడఁగి యిల్లడసొమ్ము లడఁచికొండ్రు;
ఆ. సాధుచరితు లైన జనులు దుర్గతుల రో | గములఁ దెగుదు; రల్పకాలమునన
పాపపరులు లగ్గుఁ బరమాయువును నరో | గతయు సిరియుఁ బొందఁగాంతు రెందు.