Andhra Mahabharatamu 3.4.334
Āndhra Mahābhāratamu 3.4.334
- Language
- Telugu
3.4.334
వ. ‘ఏను మండూకనాయకుఁడ; నాయు వనువాఁడ; నమ్మగువ నా కూతురు సుశోభన యనునది; దానిచేత ననేకులుబేలువడిరి; నీవెంతవాఁడ?’ వనిన నప్పరిక్షితుం ‘డట్లేని నాకు నమ్మెలఁతుకఁదెచ్చి యొప్పింపవలయు’ నని ప్రార్థించిన నతండు నవ్వుచు నవ్వామనయనం దలంపున రావించి యారాజునకు నిచ్చి, దానిం జూచి కోపించి ‘నీవు గడుం జెట్టవు; ప్రసిద్ధు లగు రాజులం బెక్కండ్రం జిక్కులం బెట్టితివి గావున నీకుం బుట్టెడు కొడుకులు కపటవర్తను లయ్యెడు’ మని కూఁతు శపియించి, మండూకరాజు నిజేచ్ఛం జనియెఁ; బరిక్షితుండును సంప్రాప్తమనోరథుండయి సుశోభనయందుఁగ్రమంబున శలుండును నలుండును వలుండును నను మువ్వురు గొడుకులం బడసి, యం దగ్రజుండయిన శలు నభిషిక్తుం జేసి తపోవనంబున కరిగె; నంత.