Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.337

Āndhra Mahābhāratamu 3.4.337

Language
Telugu

3.4.337

సీ. అనవుడు సూతుఁ డిట్లను ‘దేవ! మన మెంత | దఱిమిన మృగము దద్దయు జవంబు
గలదు; రథ్యంబులు గడుకొని కూడంగఁ | జాలవు; వలవని జాలి యేల?
మన తేరిహరులు వామ్యము లైన నమ్మృగ | మగపడు; లేకున్న నలవి గాదు’
నా విని’ వామ్యముల్‌ నాఁగ నెవ్వని హయం | బులు సెప్పు’ మనియె నబ్భూవిభుండు;
తే. వామదేవమహామునివరుని హరులు | వామ్యములు నాఁగఁ జను’ నని వాఁడు సెప్పె;
‘నతని యాశ్రమ మెచ్చట? నచటి కిపుడ | తేరు వోవ ని’ మ్మనియె ధాత్రీవిభుండు.