Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.338

Āndhra Mahābhāratamu 3.4.338

Language
Telugu

3.4.338

వ. వాఁడును రథంబు సత్వరంబుగా వామదేవునాశ్రమంబునకుం బఱపినం జని, యాతం డాతపోనిధిం గని నమస్కరించి, ‘మునీంద్రా! నాచేత నేటువడి యొక్కమృగంబు రయంబునం బఱచె; నమ్మృగంబు వధియింపవలయు; భవదీయహయంబుల నీవలయు’ ననిన నతండు’ నీవు కృతకార్యుండవై మా హయంబులం దడయక యొప్పింపవలయు, నట్లేనిం గొనిపొ’ మ్మనిన వల్లె యని వామ్యంబులం గొని రథయుక్తంబులం గావించి తదీయజవంబునకు మెచ్చుచు ముహూర్తమాత్రంబునఁ గూడముట్టి మృగంబు సమయించి మగిడి నిజపురంబునకు వచ్చి.