Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.351

Āndhra Mahābhāratamu 3.4.351

Language
Telugu

3.4.351

వ. అంతయుం జూచి వామదేవుండు ఘనరోషభీషణ ప్రహాసదుర్నిరీక్ష్యముఖుం డగుటయు, నాక్షణంబ ఘోరాకారు లగు రాక్షసు లనేకులు పుట్టి నిశాతశూలంబుల నా భూపాలుంబొడిచి కాలగోచరుం జేసిరి; మునీంద్రుఁడు నిజేచ్ఛం జనియెఁ; దదనంతరంబ శలానుజుండు నలుం డనువాఁడు నిజరాజ్యపట్టభద్రుండై సుఖంబుండఁ గొండొకకాలంబునకు వామదేవుండు సనుదెంచివానింగని’ ‘మహాత్మా! నీవు ధర్మపరుండవు; ధర్మువుదప్పనోడుదేని, మా హయంబుల ని’ మ్మనుటయు, నలుం డలిగి నిజసమీపంబున నున్న సారథిం జూచి యిట్లనియె.