Andhra Mahabharatamu 3.4.358
Āndhra Mahābhāratamu 3.4.358
- Language
- Telugu
3.4.358
వ. అని యివ్విధంబున నతం డేపు దప్పి జోహారు వెట్టుటయుఁ, దదీయ బంధుమిత్త్ర జనంబులు భయసంభ్రమంబులతో నమ్మునినాథు శరణు సొచ్చి యనునయించినఁ, బ్రసన్నుండై యమ్మహాత్ముండు దత్కరయుగస్తంభనంబు మాన ననుగ్రహించి, తదీయనందను ప్రాణంబు లొసంగె; నంత నమ్మహీకాంతుండు భార్యాసహితంబుగా నతనికిఁ బ్రణమిల్లి హయంబులఁ దెచ్చి యొప్పించినం గైకొని వామదేవుఁ డరిగె; ‘నిట్టిది బ్రాహ్మణప్రభావం’ బని చెప్పిన విని.