Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.362

Āndhra Mahābhāratamu 3.4.362

Language
Telugu

3.4.362

సీ. అనుడు నే నిట్లంటి నయ్య! ని న్నెఱుఁగంగఁ | జాలనయ్యెద; హిమశైలశృంగ
వాసియై యుండు ప్రావారకర్ణుం డను | పేరి ఘూకము గడు పెద్ద; యదియు
నాకంటె నిన్ను నిర్ణయముగ నెఱుఁగుఁ బొ | మ్మనుటయు; నన్ను రమ్మనియె నతఁడు;
ఘనరసాయనఘుటికాప్రయోగంబున | దేహతాపంబు వర్ధిల్లె నందుఁ
తే. గదలి రాఁజాల నే నంటిఁ; గడఁగి యన్న | రేంద్రుఁ డశ్వమై ననుఁ బ్రీతి నెత్తికొనుచు
నయ్యులూకముపాలికి నరిగి నన్ను | నడిగినట్టుల దానిని నడుగుటయును.