Andhra Mahabharatamu 3.4.363
Āndhra Mahābhāratamu 3.4.363
- Language
- Telugu
3.4.363
వ. అదియునుం గొండొకసేపు దలపోసి చూచి ‘యేను నిన్ను నిక్కువంబుగా నెఱుంగనేర; నింద్రద్యుమ్నం బను కొలనియందు నాళీకజంఘుం డనుపేరి బకవల్లభుండు వసియించు; నవ్విహంగంబు నాకుఁ బెద్ద; నిన్నెఱుంగు నరుగు’ మనిన నమ్మనుజపతి నాతోడఁగూడ నయ్యులూకంబు మోచికొని నాళీకజంఘునొద్దకుం జని తనపేరు సెప్పి ‘నన్నెఱుంగుదే?’ యనిన నదియు ‘నే నిన్నెఱుంగంజాల నాకంటెఁ జిరకాలజీవి యైన యకూపారుండను కచ్ఛపంబు గల; దదియును నిక్కొలన నుండు నజ్జలచరము నిన్నెఱుంగంబోలు; నడిగి చూతముగాక’ యని యక్కమఠంబుఁబేర్కొని’ యొక్క సందేహంబు నిర్ణయించుట కయి యీయార్యజనంబులు నిన్ను గుఱించి వచ్చినవారు; నీవు సనుదేరవలయు’ నని పలుకుటయును.