Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.5.399

Āndhra Mahābhāratamu 3.5.399

Language
Telugu

3.5.399

వ. అవ్వియచ్చరుల విక్రమంబునకు నోర్వక బెదరి చెదరి కురురాజసైన్యంబు ధర్మనందనుం డున్న కందువకుఁ బాఱందొడంగె; నప్పుడు రాధేయుం డజేయుండై కులశైలంబునుం బోలెఁ దరలక నిలిచి గంధర్వులు గురియు శరవర్షంబున మునుఁగుచుఁ దన యోపినంత పెనంగుచుండె; సోదర సౌబల సహాయుండై దుర్యోధనుండు గర్ణసాహాయ్యంబు వదలక నిలిచె; నంత ననంతసత్త్వు లైన గంధర్వు లనేకులు సుట్టుముట్టి.