Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.5.400

Āndhra Mahābhāratamu 3.5.400

Language
Telugu

3.5.400

ఉ. కొందఱు సూతు, నశ్వములఁ గొందఱు, కొందరు చాపదండముం
గొందఱు చక్రయుగ్మకముఁ, గొందఱు విస్ఫురితాతపత్రముం
గొందఱు కూబరంబు, మఱి కొందఱు కేతువుఁ, గొంద ఱక్షమున్‌
దందడిఁ దున్మివైచి విరథత్వ మొనర్చిరి సూతసూతికిన్‌.