Andhra Mahabharatamu 3.5.401
Āndhra Mahābhāratamu 3.5.401
- Language
- Telugu
3.5.401
వ. ఇట్లు విరథుం డయి కర్ణుండు వికర్ణురథం బెక్కిరణభూమికిం దొలంగి చనియె; దుర్యోధనుండు విముఖుండు గాక పరబలంబు మార్కొని పెనంగం దొడంగినం గినిసి చిత్రసేనుండు వానిం దలపడి తదీయస్యందనంబు రాధేయురథంబు నట్లు భగ్నంబుగాఁ జేయించి, విరథుం డగు నమ్మహీవిభుం గేశాకర్షణంబున నేలం బడవైచి పెడకేలు గట్టి సింహనాదంబు సేసినం, దక్కిన గంధర్వులుం గనుకనిం బేర్చి యతని వనితా జనంబులను, దత్సోదరు లగు దుశ్శాసన దుర్విషహ దుర్ముఖ వివింశతి చిత్రసేన విందానువిందులను, దత్తనూభవులను, దదీయమంత్రులను బట్టి బంధించి చిత్రసేనున కొప్పించి; రంతఁ బెఱకౌరవులును బౌరులు నమాత్యులుం జెదరి యాక్రోశించుచుం బఱచి, ధర్మపుత్త్రు శరణు సొచ్చి యి ట్లనిరి.