Andhra Mahabharatamu 3.5.409
Āndhra Mahābhāratamu 3.5.409
- Language
- Telugu
3.5.409
వ. ఏ కాన్వయజాతు లైన వారికి నర్థనిమిత్తం బైన భేదం బొక్కొకమాటు ప్రవర్తిల్లు; నంతన చేసి సహజస్నేహంబు దప్పనేరదు; జ్ఞాతిజనంబులు దమలో నెట్టివారైన నొప్పుం గాని, యన్యులవలనం బరిభవంబు దొడరినప్పుడు దా రొం డొరులఁ జేకొన కునికి లోక నింద్యంబు; దుర్యోధనుండు దుర్వినీతుం డైనను సభార్యుం డయి పరులచేతం బట్టు వడియె; దీని నుపేక్షించిన మనకుం గులహాని యగు; నదియునుం గాక శరణాగత రక్షణంబు రాజమాత్రుం డగు వాని కెల్ల ధర్మంబు; నీయట్టి బాహుబలసంపన్నునకు నిట్టి సుకర్మంబు కర్తవ్యం బని వేఱు చెప్పనేల? లెమ్ము! నీవును తమ్ములు నిమ్ముల రథంబు లెక్కిసర్వాయుధసన్నద్ధులై చని సుయోధను చెఱ దలఁగుం’ డనినఁ బవననందనుండు ధర్మనందనున కి ట్లనియె.