Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.5.410

Āndhra Mahābhāratamu 3.5.410

Language
Telugu

3.5.410

సీ. ‘అనుమాన మొక్కింతయును లేక యలిగి జ | లంబులఁ ద్రోచె, విషంబు వెట్టె
గృహదాహ మొనరించె, విహితదురోదర | కపటుఁడై రాజ్యంబు నపహరించె,
జనులెల్లఁ జూడంగ వనజాక్షిఁ బాంచాలిఁ | దలవట్టి యీడ్పించె, వలువ లొలువఁ
బనిచెఁ; బుట్టినకోలె మనకు నక్కట! సుయో | ధనుఁ డెగ్గు సేయని దినము కలదె?
ఆ. వానిచేఁత లొకటి యేనియుఁ దలఁపవు; | నీవు మనుజనాథ! కేవలంపుఁ
గరుణ పూని యుండు దరయ నెప్పుడు; నిట్టు | లైన మనకుఁ గార్యహాని గాదె?’