Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.351

Āndhra Mahābhāratamu 3.6.351

Language
Telugu

3.6.351

వ. ఇట్లు జటాయువుం గూల్చి రావణుం డధికరయంబున నరుగునెడ జానకి తనకు దిక్కెవ్వరు లేమిం జేసి నిరాశయై యొక్కశైలశృంగంబునందుఁ గొందఱు వానరులు మెలంగుచున్నంగని, తన కట్టిన పుట్టంబుకొంగు సించి భూషణంబులు ముడిచి తత్ప్రదేశంబున వైచెం; బంక్తివదనుండును లంకాపురంబునకుం జని యం దశోకవనమధ్యంబున నాసుమధ్య నునిచి, తదీయరక్షణార్థంబు రాక్షసీనివహంబు నియోగించె; నిట రాఘవుండు మాయామృగంబు వధియించి మగుడం జనుదెంచువాఁడు దన కెదురుగా వచ్చు లక్ష్మణుం గని ‘రాక్షస గోచరం బైన వనంబున జానకి నొంటి యునిచి వచ్చి తప్పుసేసి’ తని పలుకుటయు, సుమిత్రానందనుండు ధాత్రీతనయ తన్ను నవమానించి పలికిన తెఱంగు సెప్పిన.