Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.407

Āndhra Mahābhāratamu 3.6.407

Language
Telugu

3.6.407

వ. ఏను సకలలోకేశ్వరుండ; నాకుం గింకరులై పదునాలుగుకోట్లు నిశాచరభటులును, నిరువది యెనిమిదికోట్లు రాక్షసులును, నెనుబదియాఱుకోట్లు యక్షులును వర్తిల్లుదురు; నిఖిలధనాధ్యక్షుండయిన యక్షేశ్వరుండు నాయగ్రజుండు; బ్రహ్మసమానుం డగు విశ్రవసుండు మదీయజనకుండు; గుబేరునకు వినోదపాత్రంబు లైన గంధర్వాప్సరోగణంబులు నన్ను సేవించుఁ; బంచమలోకపాలుం డని నన్నుఁ ద్రిభువనంబులుఁ గీర్తించు; భక్ష్యభోజ్యాది వస్తువులును సురేశ్వరగృహంబునం దెట్లట్లనాగృహంబున నక్షయంబు; లిట్టినావిభవం బింతటికిని మదీయజీవితంబునకు నధీశ్వరివై సుఖంబున భోగింపు’ మనిన విని, వైదేహి క్రోధశోకవ్యాకులహృదయ యగుచు వానిదెసం జూడక యొక్కతృణాంకురం బుపలక్షించి యి ట్లనియె.