Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.408

Āndhra Mahābhāratamu 3.6.408

Language
Telugu

3.6.408

సీ. ‘అకట! పరాంగన, నబలఁ, బతివ్రతఁ, | బరికింపఁగా మర్త్యభామ నేను,
రాక్షసుండవు నీవు; రాగంబు మది నించు | కయు లేని నాదు సంగమమునందుఁ
గలిగెడు నట్టి సౌఖ్యం బెంత? యదియును | గాక యాద్యుం డైన కమలగర్భు
పౌత్త్రుఁడ నని లోకపాలతుల్యుఁడ నని | హరసఖుం డైన ధనాధినాథు
ఆ. భ్రాత నని భవత్ప్రభావంబు సెప్పితి; | విట్టి నీవు ధర్ము వెఱిఁగి దురిత
వర్తనంబు విడువవలదె? సిగ్గేది యి | ప్పగిదిఁ బ్రల్లదములు వలుకఁ దగునె?’