Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.286

Āndhra Mahābhāratamu 4.1.286

Language
Telugu

4.1.286

వ. తంత్రీపాలుం డనం బరఁగిన వాఁడ; నా చేతం గ్రేపులు పురాణించుటం జేసి కొండొక కాలంబునన కదుపులం బెనుతు; నే నగునని కైకొనిన యాఁబోతు పంచితంబు మూర్కొనినను, బైగాలి వీచినను గొడ్డునకైనం జూలు నిలుచు; నుంగిడి యదురు ద్రిక్క యను వానికి నా పేరు సెప్పినం జాలు; మఱియును బసికి వలయు తెఱంగు లెల్ల నెఱుంగుదు; వేఱొక్క పనికిం గాను గాని యే నీ వెంట నీ మనసు వడయం జాలుదు; నా వలనం బ్రయోజనంబు గొనవలయు నేని నొండుమాటలు దక్కి పసులం బరికింప నియోగింపుము.’