Andhra Mahabharatamu 4.2.234
Āndhra Mahābhāratamu 4.2.234
- Language
- Telugu
4.2.234
సీ. ‘చ్యవనుని వాంఛకు సంయాతినందన | యిడుమలఁ గుడువదె యడవిలోన?
రాఘవుతోడ నరణ్యవాసము చేసి | సంతాప మందదె జనకతనయ?
కుంభసంభవునకై ఘోరదుర్గముల లో | పాముద్ర యలజడి పాలుగాదె?
నలునిపిఱుందఁ గానల కేఁగి దమయంతి | మనుజులు పడనియుమ్మలిక పడదె?
తే. వారు సైరణచేసి దుర్వారమైన | నిరతిశయ దుఃఖభారంబు నిస్తరించి
సౌఖ్యమొందరె? నీవు నా చందమునన | యాపదల కోర్చి సంపద లనుభవింపు.