Andhra Mahabharatamu 4.2.315
Āndhra Mahābhāratamu 4.2.315
- Language
- Telugu
4.2.315
సీ. తనికెడు నారటంబున నంతకంతకు | వెమ్ముచు నునికికి విడుమరయును,
గోలు మసంగెడు కోర్కుల వెనువెంటఁ | బాఱుచు నునికికి నూఱటయును,
వావిరిఁ బొదివెడు వగల సందడిఁబడి | యురియుచు నునికికి నుడుకువయును,
నందంద కదిరెడు కొందలపాటుచేఁ | దలఁకుచు నునికికి నిలుకడయును
ఆ. లేమిఁ దాల్మిగొనఁగలేక యలందురి | తనువు నింద్రియములు మనము ధృతియుఁ
దనవశంబుగాక తల్లడపడి సింహ | బలుఁడు విషమబాణుబారిఁ బాఱె.