Andhra Mahabharatamu 4.4.224
Āndhra Mahābhāratamu 4.4.224
- Language
- Telugu
4.4.224
వ. ఆచార్యులైన వారలు పూజా వాక్యంబుల కర్హులు గాక గర్హించుటకు విషయంబె?’ యనుచుఁ గృపాశ్వత్థామల కరంబులకు నిజపాణి పుటంబులు సాఁచి యిట్లనుఁ ‘బని చాలినంత గలదు; వివ్వచ్చుండు వచ్చుచున్నవాఁడు; విరోధంబునకు సమయంబు గాదు; మనమందఱముం గూడికొని కయ్యంబు సేయుదము; బలవద్‌వ్యసనంబు నందు భేదంబు గలుగు టొప్పదని బుధులు సెప్పుదురు; వేదంబు లొక్కవలనను, ధనుర్వేదం బొక్కవలనను, గల మీయట్టి మహానుభావు లెందునుం గలరె? కురుబలంబున కొకటి పుట్టినం బ్రసిద్ధులరు గావున నది మీతలన నిలుచు; నట్లగుటం జేసి.