Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.262

Āndhra Mahābhāratamu 4.4.262

Language
Telugu

4.4.262

వ. అని పలికి, బలంబుఁ బురికొల్పికొని యతండు రాజరక్షణ తత్పరత్వంబున నరదంబు సత్వరంబు సేసిన, సేనాపతిం గని సైనికనికాయంబులుం గడంగి చనందొడంగె; నిప్పాట నమ్మేటిమొనయును వెసం బోవ గోవుల కావలి మూఁకయు వానిం దఱిమికొని యతిరయంబున నరుగం దానును గెలనఁ గ్రోశద్వయ మాత్రంబు నడచి పురుహూతపుత్త్రుం డుత్తరున కిట్లనియె.