Andhra Mahabharatamu 5.1.278
Āndhra Mahābhāratamu 5.1.278
- Language
- Telugu
5.1.278
సీ. ద్రోణుండుఁ, గృపుఁడును, ద్రోణసుతుండును | సుఖమున్నవారె? సుశ్లోకుఁడైన
భీష్ముడు కుశలియే? పెద్దతనం బిచ్చి | యాతనిఁ గౌరవు లనుసరించి
మెలఁగుదురే? బ్రాహ్మణులకు మన్నన గల్గి | యుండునే? యే మర్థి నొసఁగి నట్టి
వృత్తులు సెల్లునే? యొత్తొరు వొండుల | వలనఁ బుట్టదుగదా? కలఁకు లందుఁ
తే. బుట్టినప్పుడు గాండీవి భుజబలంబుఁ | దలఁతురే? భీమసేను గదా విహార
ముగ్గడింతురె? కవలు మహోగ్రరిపుల | భూము లంతంత కొత్తుట పొగడఁబడునె?