Andhra Mahabharatamu 5.1.335
Āndhra Mahābhāratamu 5.1.335
- Language
- Telugu
5.1.335
వ. కావున నన్ను దూఱఁదలంచితేని నా చేయునది ధర్మం బధర్మంబని నిరూపించి మఱి దూఱుము; కోపంబు నివారింపం దగు; నహింసయ యుత్తమధర్మం బగు; నట్లయినను వంశదూషకులును, లోకకంటకులును నగు పాపాత్ముల నిర్మూలంబుగాఁ జెఱుచుట ధర్మంబని పెద్దలచేత విందు; మది యట్లుండె; సంగ్రామంబు రాజులకు ధర్మం బవుంగాదని నీవచెప్పు; మట్లుంగాక యిది కర్తవ్యం బిది యకర్తవ్యం బని మనల శాసింప వాసుదేవుండు గలండు; మన కీ వితర్కం బేటికి? నితండు ధర్మాధర్మవిదులకు గురుండు, కార్యాకార్య నిరూపకులకు శిక్షకుం, డుచితానుచితజ్ఞులకుఁ బ్రదర్శకుం; డితని పంపునంగాదె యదు భోజాంధక వృష్ణి సృంజయ కేకయ ప్రభృతి భూపతి ప్రకరంబు ప్రశస్త పథంబునం బ్రవర్తిల్లుచున్నయది; విశేషించి మాకు నితని బుద్ధియ సమస్త పురుషార్థమ్ములకు మూలం బగుట నితని వచనం బవశ్యంబు నలంఘనీయం’ బనిన విని జనార్దనుండు సంజయున కిట్లనియె.