Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.343

Āndhra Mahābhāratamu 5.1.343

Language
Telugu

5.1.343

వ. ‘సంగ్రామంబు రాజులకు ధర్మం బవుంగాదని నీవ చెప్పు’మని యుధిష్ఠిరుండు నిన్నడిగెఁగదా! ద్విజాతులకు యజన యాజనాది కర్మ కరణ విభాగంబు ధర్మశాస్త్రాచార్యులు విధించునప్పుడు రాజు లిచ్చువారు గాని, వేఁడుకొనువారు గారని చెప్పుట సకలలోక ప్రసిద్ధంబు; సర్వ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనంబు సేయునట్టి రాజులు దార నిజధర్మంబు వదలుదురా? యదియునుంగాక; పాడితోడి యార్జనంబునం దమకుఁ గల కలిమి యనుభవించుచు సత్పథంబున నడచుచుండఁ, ద మ్మొరు లన్యాయంబు సేసినయప్పటికిం గదా యీ శస్త్రాస్త్రధర్మంబు లింద్రాదులగు పెద్దలు గావించిరి; నీ చెప్పెడి ధర్మంబులు కౌరవులకుం జెప్పవలవదా? వారలు గదా మీఁ దెఱుంగక కొఱఁతనుఱుకులై చెడు తెరువునం బోయెడువా’ రని పలికి మఱియు నిట్లనియె.