Andhra Mahabharatamu 5.1.346
Āndhra Mahābhāratamu 5.1.346
- Language
- Telugu
5.1.346
ఉ. ‘అత్తఱి భీష్మముఖ్యులగు నచ్చటి వృద్ధజనంబు లెల్ల నో
రెత్తక యూరకుండిరి మహీశ్వరుచిత్త మెఱుంగకున్కిఁ; దా
నొత్తి కుమారులం గినియనోపఁడ; యక్కట! మాన్పఁ గన్న; నా
చిత్తమ కాదు; లోకముల చిత్తము లెల్లను సంతసింపవే?