Andhra Mahabharatamu 5.1.361
Āndhra Mahābhāratamu 5.1.361
- Language
- Telugu
5.1.361
వ. అనిన విని సంజయుండు ధర్మతనయుం గనుంగొని ‘యట్లయినను గడు లెస్సగదా! దేవా! నా వచ్చిన కార్యంబు సఫలం బయ్యెఁ; బనివినియెద’ నని, వాసుదేవునకు నట్ల విన్నవించి, భీమార్జున నకుల సహదేవ సాత్యకి ద్రుపద విరాటుల నీక్షించి, ‘మీ యందఱచేత ననుజ్ఞాతుండన కదా? పోయి వచ్చెద. నా యాడిన మాటలయం దేమియుఁ దగని యట్టివి లేవు గదా?’ యనుటయుఁ బాండవాగ్రజుం డతని కిట్లనియె.