Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.366

Āndhra Mahābhāratamu 5.1.366

Language
Telugu

5.1.366

సీ. మా తండ్రిఁ గని యేను బ్రీతి మ్రొక్కుట గాఁగ | దండప్రణామంబు దగ నొనర్పు;
దుర్వృత్తిఁ బొరయు నా దుర్యోధనుని సేమ | మడిగితి నని చెప్పు; మతని తమ్ముఁ
డగుటకుఁ దగియెడు నా దుస్ససేనుని | కుశల మారయుము; దక్కును గుమార
వర్గంబు నెల్లను, వనితాజనంబుల | నుచితంపుమై సుఖ మున్కి యడుగు;
ఆ. విదురు, శల్యుఁ గాంచి వినయంబు దోఁపంగ | నాడు; ద్రోణతనయు నక్కు సేర్చి
కొంటి ననుము; బాహ్లికుని సోమదత్తు, భూ | రిశ్రవసునిఁ దలఁచి ప్రియము నెఱపు.