Andhra Mahabharatamu 5.1.367
Āndhra Mahābhāratamu 5.1.367
- Language
- Telugu
5.1.367
వ. మఱియు వంశవంతులు, వయోవృద్ధులు నగు భూపతులను, గృతవర్మను, గర్ణ శకుని సైంధవ ప్రభృతులను; దక్కటిరాజలోకంబును; గయ్యంబునకుఁ దోడు వచ్చిన సకల దేశాధీశులనుం గని, యెవ్వరితోడ నెవ్విధంబునం బలుకందగు ప్రణామ వినయ బాంధవ మైత్రీ వాత్సల్యంబులకు నయ్యై ప్రకారంబుల మద్వచనంబులుగాఁ బలికి; యుచితంబుమెయి నుపచరింపుము.