Andhra Mahabharatamu 5.1.370
Āndhra Mahābhāratamu 5.1.370
- Language
- Telugu
5.1.370
చ. అనఘ! భవద్బలంబునన యాపద యించుక లేక పాండునం
దనులు నిజాప్తబంధుసహితంబు సుఖస్థితి నున్నవారు; త
జ్జనకుని రాజ్యపీఠమున సమ్మద మొందఁగ నిల్పి శైశవం
బునన ప్రభుత్వ మిచ్చి తగఁ బ్రోచితి వారల విశ్రుతంబుగన్.