Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.376

Āndhra Mahābhāratamu 5.1.376

Language
Telugu

5.1.376

సీ. ఆ సమయంబున నచ్చటి వారెల్ల | వినునట్లుగా సుయోధనుని తోడ
‘బాహుబలాఢ్యుల బలవిహీనుల క్రియ | వెడలంగ నడిచిన వెఱ్ఱితనము,
నత్యంత చిరకాల మడవులఁ గొండల | బాధలఁ బెట్టిన పరుసఁదనము,
సభలోన నట్లు పాంచాల రాజాత్మజఁ | దలవట్టి యీడ్చిన తులువతనము
తే. ధర్మపుత్త్రుండు సైరించెఁ దథ్య; మీవు | కురుకుమారుల నని మ్రింగికొనకు; మొరుల
సొమ్మునకు నాసపడఁ దగ; దిమ్ము వారి | పాలు; వారలతోఁ గూడి బ్రదుకు’ మనుము.