Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.214

Āndhra Mahābhāratamu 5.2.214

Language
Telugu

5.2.214

వ. వీర లా ధర్మపుత్త్రాదుల చేతన కా దెవ్వరి చేతనుం జెడమి దెల్లంబు. బాహ్లిక సోమదత్త భూరిశ్రవ శ్శల్య సింధురాజ గాంధారరాజ ప్రభృతి మహావీరులు వీరలకంటెను శక్తి సమగ్రులు. తక్కటి రాజలోకంబును, సహాయులై వచ్చిన వివిధ దేశాధీశులును నాతోడి సుఖదుఃఖంబుల కియ్యకొని, యగ్గలికమై నగ్గినైన నుఱుకను, సముద్రంబైన నీఁదను దెంపుసేసి పొంపిరివోవుచున్నవారు. కావునఁ బాండవులకు మా దిక్కుదేఱి చూడనుం గొలంది గా, దనుమానింపకు; మిట్లునుంగాక మాకు నెవ్వరును లేక చుట్టంబులును జెలులును విడిచి, తోడు వచ్చినవారును విచ్చిపోయి, భృత్యులును విరక్తులై, వారిక పోటుమానుసులును, బంధుమిత్త్ర సహాయులును, బ్రజానురాగంబునుం గలిగినట్టిదైన నది ప్రాప్తకాలం; బింతియకాని, యేమింక వారి యడుగు లొత్తను, బాఱిపోవనుం జాల; మెల్ల భంగుల సమరంబు సేయుదుము; మా తలంపిట్టిద; నా తలంచినట్లొండె, వాసుదేవుండు దలంచిన ట్లొండె నయ్యెడు నట్లైన మే; లింత వట్టును నిర్ణయం’ బని పలికి, మఱియు నిట్లనియె: