Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.218

Āndhra Mahābhāratamu 5.2.218

Language
Telugu

5.2.218

మ. గద నాతో ‘సరి మూఁడు లోకముల నేఁ గానం; జలం బెత్తి యు
న్మదుఁ డా భీముఁడు న న్ననిం దొడరిన న్వజ్రప్రహారంబు బె
ట్టిదమై తాఁకినఁ గూలు పర్వతము మాడ్కిం గుంభినిం గూలవ్రే
సెద! నా కోర్కి గదా గదారణము వచ్చెం బెద్దకాలంబునన్‌!