Andhra Mahabharatamu 5.2.222
Āndhra Mahābhāratamu 5.2.222
- Language
- Telugu
5.2.222
వ. దుశ్శాసన దుష్ప్రహ దుర్ముఖ వివింశతి వికర్ణ చిత్రసేనాదులగు నీ కొడుకు లొకం డొకండ జగంబులెల్ల జయింపఁజాలుదు; రందఱు నొక్క మొగంబై త్రోచి నడచిన సవ్యసాచి నొక్కరుండ కాదు; పాండవులనెల్ల నొక్కెత్తున వైచికొన నోపుదు; రట్లునుంగాక, మాకు నక్షౌహిణులు పదునొకండు, వారికి నే డక్షౌహిణులు, మా సైన్యంబు సారవంతంబు; వారిబలంబు నిస్సారంబు; వారు మమ్మెవ్విధంబున జయింపనోపుదు? రీ యెక్కువ తక్కువలు విచారింపక వలవని వెఱపు గట్టికొని ముక్కూరి వగచుచున్నవాఁడవు; నిన్ను వగవకుండ నుడుపం జాల మంతియ కాని, తక్కెల్ల పనులకుం జాలుదు’ మని పలికి, సంజయు దెసఁ గనుంగొని సుయోధనుం డిట్లనియె: