Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.298

Āndhra Mahābhāratamu 5.2.298

Language
Telugu

5.2.298

వ. అనిన విని విదురుం డతని కిట్లను: ‘మనవారలు మున్న దుర్బలులు. తమలోనం బెనంకువలయి విరస వచనంబు లాడుచు నింతలు పుట్టించుట యది యర్జునునకుఁ గార్యసాధనం బింతియకాక యే మనువారము? వారలు బంధుమిత్త్ర సహాయులుం దారును నొక్క తలంపువారలయి యున్నవారు. వలవని యీ వెంగలి మాటలు విడిచి పాండవులం బిలువం బనిచి తగవు నడపుటదక్క మనకుఁ జేయందగుపని వేఱొండు గలుగునే?’ యని చెప్పిన, ధృతరాష్ట్రుండు సంజయు చెప్పిన కార్యవచనంబులు కొఱంత వినంగలవాఁడై యతని దిక్కు మొగంబు సేసి.