Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.302

Āndhra Mahābhāratamu 5.2.302

Language
Telugu

5.2.302

వ. అని పలికి, కౌఁగిలించుకొని భూషణాంబరాది కమనీయ వస్తువు లొసంగిన, నేనునుం బాండవులను వాసుదేవుని సవినయంబున వీడ్కొని యింతవట్టును దేవరకు నెఱింగింప వేగంబ వచ్చితి’ ననిన నమ్మాటలు దుర్యోధనుం డాదరింపక పెడచెవులంబెట్టె; ధృతరాష్ట్రుండును ఱిచ్చవడి యూరకుండె; నప్పు డయ్యిరువురపాలను సంజయుం డొక్కరుండుదక్క నయ్యాస్థానంబున నున్న సమస్త జనంబులును దిగ్గన లేచి తమతమ నివాసంబులకుం బోయిరి; తదనంతరంబ.