Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.221

Āndhra Mahābhāratamu 5.3.221

Language
Telugu

5.3.221

వ. నీవు వచ్చినవాఁడవు మా యింటఁ గుడిచి కూర్చుండి యెల్లపనులుం జెప్పుట యొప్పుఁగాక; కుడువనొల్ల ననం దగునె? దీనికిం గారణంబు నా యెఱింగిన యది లేదు; విచారింపక పలికి’ తనిన మందరధరుండు మందస్మితంబుతో నందఱం గలయం గనుంగొని ధార్తరాష్ట్రుకరంబు గజంబు పల్లవం బల్లన తెమల్చు లీలం గేల నమర్చి ‘యిట్టి మాటలు తేటపఱుపవలయునేని విను’మని యతని కిట్లనియె: