Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.232

Āndhra Mahābhāratamu 5.3.232

Language
Telugu

5.3.232

వ. అని మఱియు నత్యంత వినయ వాక్యమ్ముల నారాధించుచుండె; నిట్లు కృతాహారుండైన హరికి చందన చర్చా ద్యుపచారంబు లాచరించి యవ్విదురుండు కృతార్థుండై యుండఁ; గవి గాయక ప్రముఖ నిఖిల విద్వజ్జనంబులు పాఠక వాంశిక వైణికాది వినోద పాత్రంబులు నప్పరమేశ్వరుం గానవచ్చి ప్రొద్దువుచ్చి యభిమతార్థంబులు వడసి చనిరి; రాత్రియగుటయుం దగిన యభ్యంతర మందిరంబున హంసతూలికా తల్పంబున భుజంగ తల్పు నునిచి యతనికడ నుచితాసనంబున నుండి.