Andhra Mahabharatamu 5.3.235
Āndhra Mahābhāratamu 5.3.235
- Language
- Telugu
5.3.235
వ. నీ విట వచ్చుట వినిన యప్పుడు ధార్త రాష్ట్రులందఱుం గూడంబాఱి తమలో నిశ్చయించిన తెఱంగు నీ శాసనం బుల్లంఘింపం గలవారు ‘పాండునందనులకు నేమియు నీకుండువారు’ తార యీ ధాత్రియంతయు బీఱువోవ కుండ నేలువారు; వారింగూడిన రాజులెల్లను దిగ్విజయంబునాఁడు పాండవులచేత భంగపడినవారు గావునఁ గర్ణుతో నేకార్థులమై చత్తుము గెలుతు; మింతియ కాని యొండు లేదని నిశ్చయించికొని యున్నవా; ర ట్లగుటంజేసి దుర్యోధనుండు గండు మిగిలి యున్నవాఁడు; సంధి గానేరదు; వారల కందఱకు నిది ప్రాప్తకాలంబై యున్నయది; యెట్లును నుడుగ నేర్చినవారు గా;రిట్లు తమ్మెఱుంగని దుష్టాత్ముల నడుమం గూర్చుండుటయు నవ్వెంగలివిత్తు లఱచు వీఱిఁడి యఱపులకు వంకలొత్తి మాఱుసెప్పుటయు నొప్పకయుండు వెడంగు లగుటం గార్యవచనంబు లెఱుంగరు; మొఱకులగుటం బ్రతాపభాషణంబులకు వెఱవరు; వారల తలంపులు కీడు; నీ మహనీయ ప్రభావబుద్ధి పౌరుషంబు లే నెఱుంగుదు; నయినను బాండవేయులపై స్నేహంబునను నీమీఁది భక్తినిం జెప్పెద; నందుఁ బో వలవ’ దనిన వాసుదేవుం డతని కిట్లనియె: