Andhra Mahabharatamu 5.3.243
Āndhra Mahābhāratamu 5.3.243
- Language
- Telugu
5.3.243
వ. కావున నీ రెండు దెఱంగులవారికి శాంతిగావింపం బ్రయత్నంబు సేసెద; ధర్మార్థ సహితంబైన తెఱంగు మాటలు మంత్రి జన సహితుండైన సుయోధనునకుం జెప్పెదఁ దనకుం బాండునందనులకు లోకంబులకు హితంబయిన విధంబు వంచన లేక చెప్పెడు నన్ను పాండవులవాఁడని శంకించి యతండు నామాట వినండయ్యె నేనియు మేలకాక యిట్లు సొచ్చి చెప్పకున్న నన్నదమ్ములు దమలోనం బోరఁ గృష్ణుండు వారింపక యుపేక్షించెఁ దనచేతఁ జక్కంబడదా? యని యజ్ఞులైన జను లాడుదు; రెల్లభంగులం గార్యం బార్యు లియ్యకొనం జెప్పుదు; ధార్త రాష్ట్రులుం దమకు బ్రదుకు తెరువైన నా పలుకులు వట్టుదురు; పట్టక నీ తలంచిన చందమునం దులువలై కలఁగం బాఱినవారు నా ముందర నిలువం జాలుదురే’ యని పలికిన విదురుం డట్లకాక యని సమ్మతించి యామంత్రణంబు సేసి నిజ శయన స్థానంబునకుం జనియె; ననంతరంబ.