Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.3.247

Āndhra Mahābhāratamu 5.3.247

Language
Telugu

5.3.247

వ. అతండును మధుర సంభాషణంబులు చేయ వార లతనికి ధృతరాష్ట్రుండు బంధుమిత్త్రాది సమస్త పరిజన సమన్వితుండయి పేరోలగంబున నునికి యెఱిఁగించినఁ బ్రియంబునఁ గట్టాయితంబైన తేరెక్కి భేరీశంఖచామర ప్రముఖ భద్ర చిహ్నంబులతో వెడలి గరుడధ్వజంబు గ్రాలఁ గృతవర్మ సాత్యకు లొక్కరథంబునను, దుర్యోధనాది దుష్టచతుష్టయం బొక్క రథంబునను బార్శ్వంబుల రాఁ బౌరులకుఁ గన్నుల పండువగుచు రాజమందిర ద్వారంబు సేర నరుగునప్పటి యులివునకుఁ గొలువువారెల్ల నత్యుత్సుకులై యెదురుచూడ రథోత్తమంబు నవతరించి యరవిందనాభుండు.