Andhra Mahabharatamu 5.3.253
Āndhra Mahābhāratamu 5.3.253
- Language
- Telugu
5.3.253
వ. వీరలు సముచితాసనంబుల నుండక మనకుఁ గూర్చుండుట తగవుగా’దనినం గొలువువారెల్ల సంభ్రమాశ్చర్యంబులతో మునుల వలను జూచుచుండ భీష్ముండు పరిచారకులం బనిచి కనక మణిమయాసనంబు లనేకంబులు దెప్పింప వార లరుగుదెంచిన వారలకు నమస్కరించి యాసనార్ఘ్య పాద్యాది విధులం బూజలు సేయించి కృష్ణుండు గూర్చున్న యనంతరంబ ధృతరాష్ట్రుండునుం దక్కటివారును నుచిత ప్రకారంబుల నమ్మునీంద్రులకు నభివందనంబులు సేసి నిజాసనా సీనులైరి; దుశ్శాసనుండును వివింశతియును గద్దియ లిడ సాత్యకియుఁ గృతవర్మయుఁ గృష్ణుం గదిసి యిరువంకలం గూర్చుండిరి. కర్ణ దుర్యోధనులుం జేరువ నొక్క గద్దియ నుండిరి. విదురుండును మణిపీఠంబునఁ గృష్ణుని వెనుక దెసఁ దదీయోన్నత పీఠంబునఁ గరంబత్తమిల్లి యుండె; గాంధార రాజు నిజపుత్త్ర పరివృతుండై యొక్క దిక్కున నుచిత పీఠాసీనుండయ్యె; నట్టి సమయంబున.