Andhra Mahabharatamu 5.3.334
Āndhra Mahābhāratamu 5.3.334
- Language
- Telugu
5.3.334
శా. తోడంబుట్టిన భీమపార్థుల మహా దోర్దర్పముల్ లాఁతులై
తో డంచుం బెఱవారి దుర్బలుల నెందుం జొచ్చి దైన్యంబునం
గూడం బెట్టెదు; నీవ పాండుసుతులం గుందింపఁగా సత్యముం
బాడిం దప్ప రొకప్పుడుం గినియ రా బంధుత్వ మే లొల్లవో?