Andhra Mahabharatamu 5.3.379
Āndhra Mahābhāratamu 5.3.379
- Language
- Telugu
5.3.379
ఉ. కంసుఁడు నిట్ల తండ్రి మది గందెడు చంద మొనర్చి ధర్మ వి
ధ్వంసము సేసినం గులమువారలు నా కెఱిఁగింప నేను దు
ర్మాంసము గోయు వైద్యుని క్రమంబున నాతనిఁ ద్రుంచి యన్వయో
త్తంసముఁ జేయనే జనకుఁ; దద్విధ మొప్పదె మీరుఁ జేసినన్?