Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.2.336

Āndhra Mahābhāratamu 3.2.336

Language
Telugu

3.2.336

వ. అనిన ‘నాకుఁ దపోధనంబ కాని యొండుధనంబు లేదు; నీ కోరినవిధం బెట్లు సేయనేర్తుఁ? దపంబునం జేసి సర్వంబునుం బడయ నగు నంటేని నేను తపోవ్యయంబు సేయ నోప’ నని యగస్త్యుండు వసుభిక్షార్థియై శ్రుతర్వుం డను రాజుపాలికిం బోయి వానిచేతం బూజితుం డయి ‘యేను ధనార్థినై వచ్చితి నీ పోష్యజన పోషణంబునకు విఘాతంబు గాకుండ మిగులుధనంబు గలదేని నా కి’ మ్మని యడిగిన నతం డాయ వ్యయంబులు సమంబు లగుటం జేసి మిగులు లేమి యెఱింగించిన, వాఁడును దానును బ్రధ్నశ్వుండను రాజు పాలికిం బోయిన నతండును నయ్యిరువురం బరమభక్తిం బూజించి తదాగమన ప్రయోజనం బెఱింగి తన యందుల నాయవ్యయంబులు సమంబు లగుట యెఱింగించిన.